Home » Bonalu Festival
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
Bonalu Festival 2025: భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక, ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాలు మొదలయ్యాయి.
Bonalu festival: గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
Bonalu Festival: గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలతో, ఊరేగింపులతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో కోట హోరెత్తింది. ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం దక్కింది! పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన అషాఢమాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తెరలేచింది.
బోనాల జాతరకు నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పసుపు, కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరుకున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా అమ్మవారి దీవెనలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించినది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.