Home » Bhuvanagiri
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది.
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందగా.. తండ్రీకూతురికి గాయాలయ్యాయి.
హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లాలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామానికి వెళ్లి స్థానిక మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానిక విషయాలు సహా మహిళల సమస్యలపై చర్చించారు.
తెలిసిన ఓ యువకుడు వాట్సా్‌పకు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో మనస్తాపానికి గురై ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.