Home » Bhupalpalle
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణహత్య జరిగింది. ప్రజావేగు, సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలు భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్నాయి.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) కోసం భూములు ఇచ్చి రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఆ కుటుంబాలు మాత్రం చీకట్లలో మగ్గుతున్నాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగం ఇస్తామన్న కేటీపీపీ... తన హామీని తుంగలో తొక్కడంతో నిర్వాసితులు 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు.
తెలంగాణలో మరో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందనుంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.
విదేశాల్లో ఉన్నతోదోగ్యం చేయాలనే ఆ యువకుడి కల నెరవేరలేదు. వీసా కోసం దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. ఆ ఆవేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.