Home » Bhupalpalle
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.
సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
జయశంకర్ భూపాలపల్లిజిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 31 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున ప్రత్యేకాధికారులను నియమించారు.
ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ. లక్ష కట్నం ఇవ్వాలని భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలింత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
భూపాలపల్లి జిల్లా జడల్‌పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ ఘటనలో బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిల ప్రమేయం ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య సరళ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.