Home » Bhumana Karunakar Reddy
చెన్నై, కాట్పాడి మార్గాల నుంచి తిరుమలకు వచ్చే కాలినడక భక్తులకు మార్గమధ్యలో విడిదిగృహాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(TTD Chairman Bhumana Karunakara Reddy) ప్రకటించారు.
యువతలో భక్తిభావన పెంచేందుకు, హైందవ సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేసేందుకు రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు.
టీటీడీ పాలకమండలి మంగళవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్తృత్తంగా వ్యాప్తి చెయ్యాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
యువతలో సంప్రదాయ స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తామని తెలిపారు. మానవ నాగరిక జీవనంలో 30 వేల సంవత్సరాల క్రితం శిల్పకళ ప్రారంభమైందని చెప్పారు. చరిత్రకు ఆధారం శిల్పాలు అన్నారు. ప్రధానంగా శిల్ప కళాశాలలో యువతలో నైపుణ్యత పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి,ఈవో ధర్మారెడ్డి ఆలయం వద్ద ఆవిష్కరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటైంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ అధికారికంగా జాబితాను విడుదల చేసింది..
టీటీడీ ప్రకటించిన మనిషికో కర్ర ఒక జోక్‌గా మారిపోయి వైరల్ అయ్యింది. ఒక వేళ సీరియస్‌గా తీసుకున్నా ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీన్ని అమలు చేయాలంటే వేల సంఖ్యలో కర్రలు సేకరించాలి. వాటికోసం అడవి మీద పడాలి. అలిపిరిలో భక్తులకు ఇచ్చే కర్రలను మళ్ళీ తిరుమల దివ్యారామం వద్ద కలెక్ట్ చేసుకోవాలి. వాటిని వాహనాల్లో మళ్ళీ అలిపిరికి తరలించాలి. మధ్యలో భక్తులు కర్రలు పారవేయడం, విరిచేయడం చేస్తే పైకి వెళ్ళేసరికి కర్రల సంఖ్య తగ్గుతుంది.
పెద్ద పదవుల్లో ఉన్న వారు ‘భవిష్యత్ అవసరాలకు’ పనికొస్తారనుకుంటే చాలు... రకరకాల మార్గాల్లో వారి ‘చల్లని చూపుల’ కోసం ప్రయత్నిస్తుంటారు.
టీటీడీ 53వ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన చేత ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.