Home » Bhatti Vikramarka Mallu
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల అనుమతు లు, నిధులు, విభజన సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఎంపీలంతా ఏకం కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది మహిళల తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సినీ కళాకారుల మాదిరిగానే రంగస్థల కళాకారులకూ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగ పోటీలను నిర్వహించి ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
దేశంలో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) మైనింగ్‌లో తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుందని.. ఖనిజాల సాంకేతికత, మైనింగ్ రంగంలో పరస్పర సహకారానికి క్వీన్స్‌లాండ్ (ఆస్ట్రేలియా) ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎ్‌స)లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాలంటూ జెన్‌కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
రాష్ట్రంలో పోలీసు క్వార్టర్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఎక్కడెక్కడ అవసరాలున్నాయో వెంటనే ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పోలీసు శాఖను ఆదేశించారు.