• Home » Bhadrachalam

Bhadrachalam

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు.

Minister Thummala: మా గోడు పట్టించుకోండి.. భద్రాచలం విలీన గ్రామాల నేతలు..

Minister Thummala: మా గోడు పట్టించుకోండి.. భద్రాచలం విలీన గ్రామాల నేతలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Bhadrachalam: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం...

Bhadrachalam: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం...

భద్రాద్రిలో కొలువైన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం భక్తులకు లభించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా భద్రాచలంలోనూ బ్రేక్ దర్శనం భక్తులకు కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి నుంచే ఈ బ్రేక్ దర్శన అవకాశాన్ని కల్పించనున్నారు.

Khammam: ఆ ఐదు పంచాయతీలు ఇవ్వాలని ఏపీని అడుగుతాం..

Khammam: ఆ ఐదు పంచాయతీలు ఇవ్వాలని ఏపీని అడుగుతాం..

భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆంఽధ్రప్రదేశ్‌ను కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టం హామీల అమలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై జరిగే ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.

TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..

TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..

ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్‌(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.

TG: రాష్ట్రంలో నేడూ వర్షాలు!

TG: రాష్ట్రంలో నేడూ వర్షాలు!

రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.

TG: గుండెపోటుతో ఉద్యోగి, ఐదుగురు ఓటర్ల మృతి

TG: గుండెపోటుతో ఉద్యోగి, ఐదుగురు ఓటర్ల మృతి

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు.

Telangana: రూ.30 వేలిస్తే చోరీ మాఫీ!

Telangana: రూ.30 వేలిస్తే చోరీ మాఫీ!

ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, సీసీటెక్నీషియన్‌, మరో ఘటనలో ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్‌ గోడౌన్‌లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ ..

Bhadrachalam: రామయ్య పట్టాభిషేకం.. మురిసిపోయిన భక్తజనం..

Bhadrachalam: రామయ్య పట్టాభిషేకం.. మురిసిపోయిన భక్తజనం..

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం ( Bhadrachalam )భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

Telangana: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి