Home » Betting apps
బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ యాప్‌లకు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే టెస్టీ తేజ, విష్ణుప్రియకు పోలీసులు మరో అవకాశం ఇచ్చారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో కొంతమందిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశారు. అసలు బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రెటీల పేరుతో వీరు చేస్తున్న దందా ఏమిటో తెలుసుకుందాం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న.. చేసిన వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత శాఖలో ఉన్నవారైనా సరే.. వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది.
Betting Apps Pomotion Case: బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. ఈ యాప్‌ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు.
యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. గత కొంత కాలంగా యూట్యూబ్‌కు దూరంగా ఉన్న ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు. గతంలో ఆయన చేసిన ఓ తప్పు.. ఇప్పుడు వెంటాడుతోంది..
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా పెద్ద తప్పు చేశానని సుప్రీత అన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగుల్లో అప్పులపాలైన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఏపీకి చెందిన శ్రీనివాసులు కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో బెట్టింగ్ యాప్‌ల మోసానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా వెబ్‌సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలన ఎలా అనుమతిస్తున్నారు ? అంటూ సంబంధిత వెబ్‌సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిలదీసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.