Home » Betting apps
హైదరాబాద్‌లోని వినాయకనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకడు తరుణ్ రెడ్డి బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితుడై అప్పులపాలై ఈఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగి కిశోర్ కుమార్ బెట్టింగ్ యాప్ కారణంగా ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు ఆశ చూపించి బెట్టంగ్ ఊబిలోకి దించి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తుండటంతో బెట్టింగ్ యాప్స్ కారణంగా ముఖ్యంగా యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్‌ల ప్రచారానికి సంబంధించి.. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బెట్టింగ్ యాప్‌ల పేరుతో గంటలకు వందల కోట్ల వ్యాపారం., రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. లక్షల్లో నష్టపోతున్న సామాన్య ప్రజలు.. ప్రతి గ్రామంలో విస్తరించిన బెట్టింగ్ మార్కెట్.. సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే.. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ నిర్వహకులపై చర్యలు ఉండవా..
తెలంగాణ పోలీసుల దెబ్బకు, జబర్దస్త్ ఫేమ్, టీవీ నటి రీతూచౌదరి దారికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో విడుదల చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని రీతూ చౌదరి ఒప్పుకుంది.
Vishnupriya Questioned By Police: యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి విష్ణుప్రియను పోలీసులు విచారించారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై..
బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. ఈ యాప్‌ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేసి.. నోటీసులు ఇస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రెటీలపై పోలీసులు చర్యలు ప్రారంభించినా.. గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆగడంలేదు. కొందరు వ్యక్తులు టెలిగ్రామ్, వాట్సప్ ఛానల్స్‌లో ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ సమస్యపై ఈడీ ఆరా తీసింది.