• Home » Bellampalli

Bellampalli

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ప్రజల మద్దతుతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. తాళ్లగురిజాలలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్‌ ప్రారం భించి మాట్లాడారు. క్రీడాకారులు, యువకులు కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 మామిడిగూడెంలో వైద్య శిబిరం

మామిడిగూడెంలో వైద్య శిబిరం

మామిడిగూడెంలో జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాలను కొనసాగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీష్‌రాజ్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మామిడిగూడెంలో జ్వరాలు ప్రబలి ప్రజలు మంచాన పడ్డారనే వార్త గురువారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది. స్పందించిన జిల్లా యంత్రాంగం మామిడిగూ డెంలో వైద్య శిబిరం నిర్వహించారు.

బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దు

బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దు

సిం గరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయవ ద్దని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు గోమాస ప్రకాష్‌ అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను సం స్థకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వ ర్యంలో శ్రీరాంపూర్‌ ఓసీపీ, సీసీసీలోని ఆటోల అడ్డాలు, భవన నిర్మాణ కార్మికుల నుంచి సంత కాల సేకరణ చేపట్టారు.

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలి

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్ధమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం పట్ట ణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

విద్య, వైద్యం, సాగు రంగాల అభివృద్ధికి కృషి

విద్య, వైద్యం, సాగు రంగాల అభివృద్ధికి కృషి

గ్రామాల్లో విద్య, వైద్యంతోపాటు సాగు నీటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తా నని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంగళవారం స్వగ్రామం నెన్నెల మండ లం జోగాపూర్‌ వచ్చారు. ఆయనను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నారు.

mancherial రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

mancherial రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్‌ అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో తాండూర్‌, తాల్లగురిజాల, నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం బోయపల్లి పెద్ద చెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

పెద్ద ధర్మారం సమీపంలో పెద్దపులి

పెద్ద ధర్మారం సమీపంలో పెద్దపులి

కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే.

 సింగరేణి పరిరక్షణకు పోరాటాలు

సింగరేణి పరిరక్షణకు పోరాటాలు

తెలంగాణకే తలమానికమైన సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం సీపీఎం పార్టీ మూడవ మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి