Home » Ballari
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్రలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో డ్యాంలోకి వరద నీరు వస్తుండగా ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలుగా ఉంది. అలాగే.. ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది.
తుండభద్ర రిజర్వాయర్ నీటి విడుదలపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలపై అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయకపోవడం వలన రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.
‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.
వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.
గాలి జనార్దన్‌రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.
బళ్లారి కానిస్టేబుల్ కుమారుడిగా మొదలైన గాలి జనార్దన్‌రెడ్డి ప్రయాణం, మైనింగ్ దందాతో కోట్లకు పడగెత్తి, చివరికి అక్రమాల కేసుల్లో సీబీఐ చేత శిక్షితుడిగా ముగిసింది. చిత్తూరు నుంచే బళ్లారి వరకు సాగిన ఈ ప్రస్థానం రాజకీయ, వ్యాపార, న్యాయ పరమైన పరిణామాలతో నిండి ఉంది
సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు
అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బి. శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు రాజుల కాలం నాటి హరెమనె స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడంం సరి కాదని ఆయన పేర్కొన్నారు.