• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya Visits: అయోధ్య పర్యటనలను వాయిదా వేసుకోండి.. మంత్రులకు సూచించిన మోదీ

Ayodhya Visits: అయోధ్య పర్యటనలను వాయిదా వేసుకోండి.. మంత్రులకు సూచించిన మోదీ

అయోధ్యలో బాలక్ రామ్ దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు.

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. రామచంద్రుడి దర్శన వేళలు పొడగింపు..

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. రామచంద్రుడి దర్శన వేళలు పొడగింపు..

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలోకి వానరం.. ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు!

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలోకి వానరం.. ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు!

సోమవారం ‘ప్రాణప్రతిష్ఠ’ క్రతువు పూర్తవ్వడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామమందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాములవారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది.

Shikha Goel: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలి: శిఖా గోయల్

Shikha Goel: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలి: శిఖా గోయల్

హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!

Ram Lalla In Ravana’s Village: 500 ఏళ్ల నాటి భారతీయుల కల నిన్నటితో(జనవరి 22, 2024) తీరింది. ఇన్నాళ్లు గుడారం లాంటి మందిరంలో తలదాచుకున్న రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలోకి అడుగు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను మించి వేడుకలు నిర్వహించారు జనాలు. తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి రాములోరికి స్వాగతం పలికారు భక్త జనులు.

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్‌కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

PM Modi: మోదీ ఉపవాస దీక్ష ఎలా విరమించారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

PM Modi: మోదీ ఉపవాస దీక్ష ఎలా విరమించారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 11 రోజుల ఉపవాస దీక్షను సోమవారం విరమించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ అందించిన రామ 'చరణామృతం' తాగడం ద్వారా ప్రధాన తన ఉపవాసాన్ని ముగించారు.

Business: ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఒక లక్ష కోటికిపైగా వ్యాపారం

Business: ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఒక లక్ష కోటికిపైగా వ్యాపారం

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన రోజున దేశంలో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తేలింది.

Watch Video: అయోధ్యలో ఇద్దరు ‘లెజెండ్స్’.. వైరల్ అవుతున్న వీడియో

Watch Video: అయోధ్యలో ఇద్దరు ‘లెజెండ్స్’.. వైరల్ అవుతున్న వీడియో

జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి