Home » AP High Court
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకు బదలాయించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరిగింది.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్ బాండ్‌ల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కొనుగోలు దారులకు ఊరటనిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీమాంసలో పడేసింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుకు సంబంధించి టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది..
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేశారని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై నమోదైన కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్షలుపడే సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి, భద్రతకు సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తమ ఇంటికి భద్రత కల్పించాలని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జోగి రమేష్ కుమారుడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.