AP High Court: హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకం
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:55 AM
ఏపీ హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థల తరఫున వాదనలు వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థల తరఫున వాదనలు వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవాది ఎస్‌వీఎ్‌సఎస్ శివరామ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ)కు స్టాండింగ్ కౌన్సిల్ నియమితులయ్యారు. న్యాయవాది ఓరుగంటి ఉదయ్‌కుమార్ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యునివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు. న్యాయవాది కె.మణికంఠేశ్వరరావును ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.