• Home » AP Election Counting

AP Election Counting

AP Election Counting 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్.. ముందుగా పోస్టల్ బ్యాలెట్

AP Election Counting 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్.. ముందుగా పోస్టల్ బ్యాలెట్

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 26,721 మంది ఉన్నారు.

AP Election Results: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అధిక్యం..

AP Election Results: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అధిక్యం..

ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.

AP Election counting 2024: ఆ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్.. ఇంటి బాట పట్టిన కొడాలి, రోజా, వంశీ, అనిల్..

AP Election counting 2024: ఆ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్.. ఇంటి బాట పట్టిన కొడాలి, రోజా, వంశీ, అనిల్..

ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్‌ దిశగా దూసుకెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.

AP Election Results:కౌంటింగ్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన వైసీపీ..

AP Election Results:కౌంటింగ్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన వైసీపీ..

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..

ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Chandrababu: ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

Chandrababu: ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు.

Liquour shops : మందు జాగ్రత్త..!

Liquour shops : మందు జాగ్రత్త..!

కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను సోమవారం బంద్‌ చేశారు. ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది షాపులకు సీల్‌ వేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి బంద్‌ చేయించారు. పోలింగ్‌ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి నియోజకవర్గంలో ఈ నెల 5వతేదీ దాకా మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 4వతేదీ దాకా మూసేస్తారు. దీంతో మద్యం ప్రియులు ‘మందు’ జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం...

AP ELECTIONS COUNTING :  నేడే తెలిసేది!

AP ELECTIONS COUNTING : నేడే తెలిసేది!

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఓటరు జాబితా తయారీ మొదలు.. పోలింగ్‌ ముగిసేవరకూ మునుపెన్నడూ లేనన్ని ప్రలోభాలు.. బెదిరింపులు, దాడులు చోటు చేసుకున్నాయి. అన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ఓటరు.. మీట నొక్కి తన నిర్ణయం ప్రకటించాడు. అదేమిటో మంగళవారం తేలిపోతుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు ఆలస్యమైనా.. రాత్రికి మాత్రం తుది ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయి. మే 13న పోలింగ్‌ ముగిశాక.. మూడు వారాల...

AP ELECTIONS : జేఎనటీయూ రెడీ..!

AP ELECTIONS : జేఎనటీయూ రెడీ..!

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జేఎనటీయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతపురం పార్లమెంటు స్థానంతోపాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి