Home » AP CM
రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని...ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ హైకోర్టులో చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెప్పే రోజు ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.