• Home » AP Assembly Elections 2024

AP Assembly Elections 2024

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

Elections 2024: పోలింగ్‌లో టాప్ ఆ నియోజకవర్గాలే.. విజయం వరించేది ఎవరినంటే..

Elections 2024: పోలింగ్‌లో టాప్ ఆ నియోజకవర్గాలే.. విజయం వరించేది ఎవరినంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 79.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం పోలింగ్ నమోదైంది.

AP Election 2024: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

AP Election 2024: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

నిన్న ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓటేయడానికి జనం పోటెత్తారు. ప్రభంజనంలా తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

Kesineni Chinni: ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలోనే భారీ ఎత్తున పోలింగ్

Kesineni Chinni: ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలోనే భారీ ఎత్తున పోలింగ్

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేడు తెలిపారు.

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.

AP Elections: వైసీపీలో అలజడి.. !

AP Elections: వైసీపీలో అలజడి.. !

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ఓటర్లంతా స్వస్థలాలకు పోటెత్తారు. అదీ కూడా దసరా, సంక్రాంతి పండగ వేళన్నట్లుగా.. మే 13వ తేదీకి ఒక రోజు ముందే ఓటర్లలంతా సొంతూళ్లకు పయనమయ్యారు.

AP Election Polling 2024: శ్రీ సత్యసాయి జిల్లాలో టెన్షన్.. టెన్షన్ అసలేం జరుగుతోంది..?

AP Election Polling 2024: శ్రీ సత్యసాయి జిల్లాలో టెన్షన్.. టెన్షన్ అసలేం జరుగుతోంది..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ వార్డు శాంతినగర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రం 164, 169, 170, 171 బూత్‌ల వద్ద రిగ్గింగులకు వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.

AP Election Polling 2024:వారిపై చర్యలు తీసుకుంటాం..  ఎస్పీ నయీం అస్మి వార్నింగ్

AP Election Polling 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎస్పీ నయీం అస్మి వార్నింగ్

నగరంలోని పోరంకిలో ఈరోజు పోలింగ్‌లో జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ నయీం అస్మి (SP Naeem Asmi) హెచ్చరించారు. సోమవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆరు గంటల్లోపు బూత్ లోపలికి వచ్చిన వారికి ఓటు వేసే సౌకర్యం ఉంటుందని ఎస్పీ తెలిపారు.

AP Election Polling 2024: అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన ఎన్ఆర్ఐ

AP Election Polling 2024: అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన ఎన్ఆర్ఐ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి