Home » Andhra Pradesh Politics
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు.
‘మా వీధిలో బోరు వేయించండి. గుడి నిర్మాణానికి సా యం చేయండి. మాకు రోడ్డు వేయించండి’ ఒకప్పుడు ఓట్లు అడగడానికెళ్లే అభ్యర్థులకు ఇలాంటి డిమాండ్లు ఎదురయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ట్రెండ్ మారింది.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు..
ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్‌లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.