Home » Anantapur urban
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్శింగ్ కార్మికుల కోసం చట్టప్రకారం కనీస వేతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా ఆ సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
మూడు రోజుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ హెచ్చరించారు. సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు.
మండలంలోని బొమ్మే పర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీమాత విగ్రహానికి గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీమాత జయంతి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి.
ఉద్యోగభద్రత కల్పించాలని, ఎనహెచఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే తమ పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచఓ ల నిరసన జిల్లాలో కొనసాగింది. ఇప్పటికే నిరవధిక సమ్మెకొన సాగిస్తున్నా రు.
మండల కేంద్రమైన రాప్తాడు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో మినీ వాటర్ ట్యాంకులు నిరుపయో గంగా ఉన్నాయి. ట్యాంకులకు నీరు సరఫరా చేయకపోవడంతో అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు సమీపంలో పండమేటి వెంకటరమణస్వామి ఆలయం సమీపంలో రాప్తా డు, ప్రసన్నాయపల్లి గ్రామ ప్రజలకు దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్‌లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది.
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.