rights ‘ఉద్యమాలతోనే హక్కులు పొందగలం’
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:26 AM
ప్రజా ఉద్యమాలతోనే స్వే చ్ఛా హక్కులు పొందలమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కారంచేడు, చుం డూరు ఘటనలలో దళిత మృతవీరులను సర్మించుకుంటూ బుధవారం నగరంలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం వైద్యం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రజా ఉద్యమాలతోనే స్వే చ్ఛా హక్కులు పొందలమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కారంచేడు, చుం డూరు ఘటనలలో దళిత మృతవీరులను సర్మించుకుంటూ బుధవారం నగరంలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం సాగిన కారంచేడు, చుండూరు మారణకాండ యావత దేశాన్నే నివ్వెర పరిచిందన్నారు. కులవివక్షతపై పోరాటాలు చేసిన అనేకమంది దళితులు అమరులై సమాజానికి సేచ్ఛను కల్పించారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, బెంజిమెన, అంజి, కేపీ రాజు, రమేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
మరిన్న అనంతపురం వార్తలు..