Home » Anantapur urban
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి హాస్టళ్లు, ప్రైవేట్ గదుల్లో అద్దెకు ఉండి రెండేళ్లపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ చదువులు శనివారం నాటికి ముగిశాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల సర్వే ఎట్టకేలకు పూర్తైంది. మూడున్నర నెలల కుస్తీ నేపథ్యంలో సర్వే వంద శాతం పూర్తి కావడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపా రుల వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. గత ఏడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్ శాఖ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన ఉందని వినియోగదారుల కమిషన అధ్యక్షురాలు శ్రీలత అన్నారు. అప్పుడే చట్టం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం గనులు, నిర్వహణ నిధులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. పట్టణానికి చెందిన నలుగురు కౌన్సిలర్లతోపాటు ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుమారం రేపింది. రాయదుర్గం వైసీపీలో ఇటీవల అసమ్మతి బ లపడుతూ వస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా రెం డువర్గాలుగా విడిపోయి, తన్నుకునే స్థాయికి చేరారు.
రాష్ట్రంలో అద్దె విలువ ఆధారంగా పాతపద్ధతిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ పట్టణ పౌరసంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అబుల్ కలాం విగ్రహాన్ని నాలుగేళ్లుగా ఎందుకు పెట్టించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని ఆ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీశారు.
విద్యార్థులకు వినికిడిలోపం శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు.
నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు.