Home » Anagani Satya Prasad
Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన జొన్నాదుల కోటేశ్వరరావు స్విఫ్ట్ కారును గెలుచుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విజేతను ఎంపిక చేసి అభినందించారు
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు.
నాలా చట్టం రద్దుపై త్వరలో విధివిధానాలు విడుదల చేస్తామని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నారెడ్కో ప్రతినిధులు మంత్రి సత్యప్రసాద్‌ను కలసి ఆయన కృషికి సత్కారంగా శాలువా కప్పి సత్కరించారు
రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియ వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు.
Minister Anagani Sathya Prasad : విద్యారంగాన్ని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్‌లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అలా వచ్చి ఇలా వెళ్లడాన్ని టీడీపీ నేతలు పలువురు తప్పు పట్టారు. కేవలం శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే సభకు వచ్చారంటూ విరుచుకుపడ్డారు.