Home » Amit Shah
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందని అడిగిన ఒక ప్రశ్నకు ద్రవిడ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి పేరును ప్రస్తావించకుండా అమిత్‌షా సమాధానమిచ్చారు.
ప్రపంచ పోలీసు క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన 2029 ప్రపంచ పోలీస్, అగ్నిమాపక క్రీడలకు అహ్మదాబాద్ వేదిక అయింది. ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
నక్సల్స్ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఆదివారంనాడు ఆయన శంకుస్థాపన చేశారు.
అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..
పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందే. ఆ దేశం నీటి కొరతతో అల్లాడాల్సిందే. సింధు నది జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తే లేదు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు.
ఏప్రిల్ 21న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై అమిత్‌షా మాట్లాడుతూ, కశ్మీర్‌లో శాంతి, పర్యాటకాన్ని దెబ్బతీసి, కశ్మీర్ యువకులను తప్పదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ప్రజలకోసం పోరాటం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ నాయకులకు సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్‌షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడవద్దని, హిందీలో మాట్లాడమని చెబుతుంటారని, అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీలోని పిల్లల మాత్రం ఇంగ్లీషు విద్యకు వెళ్తుంటారని, దీని వెనుక కారణమేమిటని రాహుల్ ప్రశ్నించారు.