Home » Allu Arjun
హైదరాబాద్, జనవరి 03: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీలసలాట ఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టుల ఈ మేరకు తీర్పు వెలువరించింది.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప సినిమా కలెక్షన్లు పెరిగాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.
BANDI SANJAY: కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చని చెప్పారు. 14 శాతం కమిషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రుల బండారం బయట పెడుతామని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
Andhrapradesh: అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం’’ అని పవన్ అన్నారు.
Sandhya Theatre Stampede: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది.
Allu Arjun: పుష్ప 2 చిత్రం హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమను బెదిరిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి జేఏసీ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్యా థియేటర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రిమీయర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసులో శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కీలక ప్రకటన చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా అల్లు అర్జున్ రిమాండ్ పొడిగింపుపై మరికొద్ది సేపటిలో వర్చ్యువల్ విధానంలో హాజరు కానున్నారు.
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వర్చువల్ విధానంలో హాజరవుతారు. అసలు అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతున్నారు.