Home » Akhilesh Yadav
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
వారణాసిలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.
ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్ అసెంబ్లీ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేష్ యాదవ్ ఇటీవల ఎన్నిక కావడంతో ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన యూపీలోని కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కర్హల్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయనున్నారు.
Lok Sabha Election Results 2024: ఎంతో ఉత్కంఠ రేపిన ఎన్నికల సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) పర్వం ముగిసింది. వార్ వన్ సైడే అనుకున్న వారందరికీ బిగ్ షాక్ ఇచ్చాయి ఎలక్షన్ రిజల్ట్స్. ఈ ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నో రికార్డులకు కేరాఫ్‌గా మారింది. అలాంటి రికార్డులలో ప్రత్యేకమైన ఒక అంశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక జిల్లాలో..
లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.