Home » Airport
ప్రపంచ నలు మూలల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
దేశంలోని పలు విమానాశ్రయాలకు మంగళవారంనాడు బాంబు ఈ-మెయిల్స్ రావడం కలకలం సృష్టించింది. పాట్నా, కోయంబత్తూరు, జైపూర్, వడోదరా సహా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో అన్నిచోట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పాటు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) బాంబు బెదిరింపు(Bomb threats)లు వచ్చాయి. గుర్తుతెలియని అగంతకుడు ఎయిర్ పోర్ట్ మెయిల్‌కు బాంబు ఉందని లేఖ పంపారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
స్థానిక మీనంబాక్కం(Meenambakkan)లోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబులు పేలనున్నాయని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించడంతో బాంబ్‌స్క్వాడ్ నిపుణులు, భద్రతాదళం ఉన్నతాధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్ వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్‌వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల నుంచి బంగారం, నగదు, డ్రగ్స్ తదితరాలను అక్రమంగా తరలించడం చూస్తుంటాం. కొందరైతే ఏంకగా తమ శరీర భాగాల్లో బంగారు బిస్కట్లు, డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకెళ్తూ విమానాశ్రయ అధికారులకు పట్టుబడడం చూస్తుంటాం. ఇలాంటి...
Andhrapradesh: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది.