Home » Airport
సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లతో పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారన్నారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమై భద్రత సిబ్బంది... వారిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Kempegowda International Airport) ఏడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్, ఫుడ్, బెవరేజ్‌తోపాటు హాస్పిటాలిటీ కాన్ఫరెన్స్ తదితర విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్ కల్చర్ వీక్ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీని కారణంగా స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్టు మెట్రోను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లు కాగా.. రేవంత్ సర్కారు తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది.
మైక్రోసాఫ్ట్ విండోస్ ‘బ్లూస్ర్కీన్ ఎర్రర్’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనకు పోర్న్ వీడియోలు చూపి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు నవీన్ జిందాల్‌కు ‘ఎక్స్’ వేదికగా ఫిర్యాదు చేశారు. విమానంలో తన పట్ల జరిగిన దారుణాన్ని ఆమె ఓ పోస్టులో వివరించారు. ‘