• Home » AIADMK

AIADMK

MP Raja: హోదా మరచి మాపై దుమ్మెత్తిపోస్తారా...

MP Raja: హోదా మరచి మాపై దుమ్మెత్తిపోస్తారా...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి..  ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి.. ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) సూచించారు.

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.

EPS: హీరో విజయ్‌పై విమర్శలు వద్దు..

EPS: హీరో విజయ్‌పై విమర్శలు వద్దు..

టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్‌పై విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సూచించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై విమర్శలు గుప్పించాలని, డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్‌కుమార్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.

EPS: ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అసలు ఆ హీరో ప్రభావం ఎంత..

EPS: ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అసలు ఆ హీరో ప్రభావం ఎంత..

అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

Chennai: కొడనాడు ఎస్టేట్‌ కేసులో సీబీసీఐడీ విచారణకు రమేష్‌

Chennai: కొడనాడు ఎస్టేట్‌ కేసులో సీబీసీఐడీ విచారణకు రమేష్‌

మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్‌ రమేష్‏ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్‏లో వాచ్‌మన్‌ హత్య, మరోవాచ్‌మన్‌పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్‌రూమ్‌ ఇన్‌ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.

EPS: నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు

EPS: నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు

ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు.. ప్రధాని నరేంద్ర మోదీకి, యుద్ధానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రజానీకం తోడుగా వుండాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కోరారు.

AIADMK: నీట్‌పై సీఎం క్షమాపణ చెప్పాలి..

AIADMK: నీట్‌పై సీఎం క్షమాపణ చెప్పాలి..

నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్‌ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్‌ మాత్రమేనని ఈపీఎస్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి