Home » AIADMK
అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్‌ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్‌లో వాచ్‌మన్ హత్య, మరోవాచ్‌మన్‌పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్‌రూమ్ ఇన్‌ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు.. ప్రధాని నరేంద్ర మోదీకి, యుద్ధానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రజానీకం తోడుగా వుండాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కోరారు.
నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్ మాత్రమేనని ఈపీఎస్ తెలిపారు.
నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నీట్’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
అన్నాడీఎంకే పార్టీ చిహ్నామైన రెండాకుల గుర్తు విషయంలో ఏర్పడ్డ విభేదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్దామి, పన్నీర్ సెల్వంలను 28ంతేదీన విచారణకు రావాలని ఆదేశించింది.
అధికారంలో భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడించాయన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై అన్నారు. 2026లో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా.. మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.
‘ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది అన్నాడీఎంకే - బీజేపీ కార్యకర్తల తీరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే కొందరు బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్ అంటూ ప్లెక్సీలు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.