Home » AIADMK
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలనా తీరుకు వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ అపారమని, అధికారంలోకి రాబోయేది తామేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్ మాళిగై’లో ప్రేతాత్మ సంచరిస్తున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజమని నమ్మే విధంగా ఐదురోజులుగా ఆ కార్యాలయం వద్ద సాయంత్ర వేళ్లలో ఓ మాంత్రికుడు సంచరిస్తూ శంఖాన్ని ఊదుతూ కనిపిస్తున్నాడు
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్‌షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) సూచించారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.