Home » Adilabad
మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెబ్బులి హడలెత్తిస్తోంది. పాత మంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్‌లోని అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు, అడవిలోకి వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్ వైర్లు అమర్చకూడదని సూచించారు.
అమృత్ 2.0 పథకంతో జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు చేపట్టిన ఏరియల్ సర్వేను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధికి డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టినట్లు చెప్పారు.
సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. యూనియన్ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రఫీయాలు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.
మంచి ర్యాల పట్టణానికి ఇకమీదట వరద ముప్పు తప్పనుంది. యేటా వర్షాకాలంలో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్ల వాగు వరదలను నివారించేందుకు కరకట్టలు నిర్మించా లని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాగుకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ (అడ్డుగోడ) నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా బుధవారం అధికారులు రాళ్లవాగులో సర్వే జరిపారు.
క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని జిల్లా కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గణపతితో కలిసి పోటీలను పరిశీలించారు.
ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం నెన్నెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణంలోని చిరు వ్యాపా రులు, కూరగాయల వ్యాపారులు ఎవరైనా రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చైర్‌పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. బుధవారం చిరు వ్యాపారుల కోసం బంకర్ వద్ద స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు.
నిజామా బాద్-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్-63 విస్త రణ పనులకు బ్రేక్ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది.
లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కొడంగల్‌లో రైతన్నలపై అక్రమ కేసులు బనాయించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహా నికి వినతిపత్రం అందించారు.