Home » Adani Group
రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్ మీటర్ల టెండర్లు... బైజూస్ ట్యాబ్‌లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు.
అదానీకి తెలంగాణలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రల మాటేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఎద్దేవా చేశారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు తొట్టి గ్యాంగ్ బ్యాచ్‌తో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్రజలను మభ్య పెట్టాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చూశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ రావు విమర్శించారు .
అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తెలిపారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశం లేదన్నారు.
పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.
మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుదుత్పత్తి చేసి నిల్వ చేసే ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా గత జగన్ సర్కార్ అదానీ పవర్ సంస్థలకు కట్టబెట్టింది.
సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ వెల్లడించారు.
అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ, జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. సోమవారం తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయనున్నారు.