Home » ACB
E Car Race Scam: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు నిధుల చెల్లింపు విషయంలో తాను నిమిత్తమాత్రుడినేనని హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులతో అన్నట్లు తెలిసింది.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారమంతా నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అప్పట్లో ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను దాదాపు మూడు గంటలుగా ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయం, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ACB RAIDS: ఫార్ముల ఈ కార్ రేసు కేసుకు సంబంధించి అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఏపీలోని మచిలిపట్నంలోనూ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక డ్యాంకుమెట్లనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana: కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రీన్‌కో తో పాటు అనుబంధ మూడు కంపెనీలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీ్‌సలు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదు.
ACB Notice: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
Formula E-Car Race Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.