Home » ACB
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్.. 11కేవీ విద్యుత్ లైన్‌ను పక్కకు మార్చడానికి దుండిగల్ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్‌స్టేషన్ ఏఈ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు.
తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అన్నదమ్ముల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎదునూరి రమేష్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
జగన్ మీడియాతోపాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి రూ.వందల కోట్లు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీచేసింది.
SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.
భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు, ప్లాట్ మ్యుటేషన్ చేయడానికి, బార్ లైసెన్స్ జిరాక్సు కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు.
అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరక్టర్ జనరల్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Online Fraud: యాదాద్రి జిల్లా రాజాపేట్ తహసీల్దారుగా దామోదర్‌ను ఓ కేటుగాడు మోసం చేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
‘పై సంపాదన’ జేబులో పడితే కిక్కే వేరు కావొచ్చు గానీ పట్టుబడితే ఎన్ని చిక్కులో కదా! ఈ లాజిక్ మరిచి.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు వేర్వేరుచోట్ల నలుగురు అధికారులు!
ఓ కేసులో రూ.50 వేల లంచం డిమాండు చేసి రూ.30 వేలు తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా తీసుకుంటున్న ధారూరు ఎస్‌ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.