Home » AAP
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు నుంచి 'బచత్ పత్ర' ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
Delhi Assembly Elections: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోరు జరగనుంది.
గత ఏడాది ఏప్రిల్‌లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అతిషి బీజేపీపై ఆరోపణలు చేశారు. తనను, ఇతర ఆప్ నేతలను బీజేపీకి చెందిన కొందరు సంప్రదించినట్టు తెలిపారు. తమ పార్టీలోకి చేరాలని, లేదంటే నెలలోగా ఈడీ అరెస్టును ఎదుర్కోవలసి వస్తుందని వారు చెప్పినట్టు అతిషి ఆరోపించారు.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుసగా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఆప్, బీజేపీ వినూత్న శైలిలో ఇంతవరకూ పోటాపోటీగా పోస్టర్లు విడుదల చేయగా, అవీనితిపరుల జాబితా అంటూ రాహుల్‌ను కూడా అందులో చేర్చడం ఇదే మొదటిసారి.
కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని సిసోడియా అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.