Home » AAP
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్‌ను ఎడిట్ చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) ఆ పార్టీలో చేరారు. అనంతరం సచ్‌దేవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుందని చెప్పారు.
హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద జైన్‌ను 2022 మేలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.
యమునా నది పునరుజ్జీవనానికి ఎల్జీ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీని 2023 జనవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇందుకు తొలుత ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణల తొలగించడం,11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడ జరిగింది.
తన గెలుపును పంచుకుంటూ మాజీ ముఖ్యమంత్రి అతిషి డాన్స్ చేసినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా సైతం ఓటమి పాలయ్యారు. మరి అలాంటి వేళ.. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా హస్తం పార్టీకి ఆయన స్నేహ హస్తం అందిస్తారా? లేక కటీఫ్ చెబుతారా? అనే ఓ మీమాంస సామాన్యుడిలో కొనసాగుతోంది.
ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. గత 12 సంవత్సరాలుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ మరోసారి రిక్త హస్తాలతో మిగిలిపోయింది.