Home » AAP
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుసగా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఆప్, బీజేపీ వినూత్న శైలిలో ఇంతవరకూ పోటాపోటీగా పోస్టర్లు విడుదల చేయగా, అవీనితిపరుల జాబితా అంటూ రాహుల్‌ను కూడా అందులో చేర్చడం ఇదే మొదటిసారి.
కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని సిసోడియా అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్‌పై 14 కాగ్ నివేదికలు తీవ్ర ఆరోపణలు చేశాయనీ, ఇందులో రూ.382 కోట్ల హెల్త్ రిలేటెడ్ స్కామ్ జరిగినట్టు పేర్కొన్న నివేదక కూడా ఉందని అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తమ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..