ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.
వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్‌లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్‌లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది.
ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.
సిలిగురి కారిడార్‌లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలను కేంద్రం కోరింది.
దేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. రెండు దశాబ్దాల కాలంలో టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గడంతో 2080 నాటికి భారత జనాభా స్థిరంగా ఉంటుందని ఐఏఎస్పీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.