మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు అనుకూలించవు. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పధంతో ముందుకు సాగండి. బుధవారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్నలో మెలకువ వహించండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ప్రతికూలతలను అధిగమి స్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసు కుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీజోక్యం అనివార్యం. వ్యాపకాలు, పరిచయాలు విస్తరి స్తాయి. గురు, శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించ వద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. తప్పట డుగు వేసే ఆస్కారం ఉంది. కొంతమంది వ్యాఖ్యలు బాధిస్తాయి. ఆగ్రహావేశాలు అదు పులో ఉంచుకోండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శనివారం నాడు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఖర్చులు విపరీతం. ఆది, సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచా రం ఉత్సాహాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపు తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సానుకూలమవు తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆది, గురువారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన తప్పనిసరి.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. ఆలో చనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉం డేందుకు యత్నించండి. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. శుక్ర, శనివారాల్లో ప్రముఖుల సం దర్శనం వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలి కమే. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనం ఆల స్యంగా అందుతుంది. సోమ, మంగళవారాల్లో పనులు సాగవు. సన్నిహితులను కలుసుకుం టారు. ప్రతి విషయాన్నీ మీ భాగస్వామికి తెలియజేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. గృహమార్పు కలిసివస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. ఆదాయమార్గాలు అన్వేషి స్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. బుధవారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదు టపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పరిచయాలేర్పడతాయి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఈ వారం ప్రతికూలతలు అధికం. సమర్థతకు గుర్తింపు ఉండదు. పదవులు దక్కకపోవచ్చు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవు తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగి స్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన శ్రేయస్కరం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పోగొట్టుకున్న వస్తు వులు లభ్యమవుతాయి. పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి సన్నిహితులకు సాయం అందిస్తారు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది.