జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైంది. పోస్టల్ బ్యాలెట్ మొదలు.. రౌండ్ రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ గెలుపుతో రేవంత్ వ్యూహం ఫలించినట్లైంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్ కు ఊహించని షాకిస్తున్నాయి. ఆ కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు 3 వేలకు పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో నవీన్ ఉన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 160కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే, తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో మొత్తం 101 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అధిక్యతతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు మొదలు పెట్టారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై అందరిలో టెన్షన్ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఓటింగ్‌లో విజయం ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థులతో పాటు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.