జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్కడి ప్రజలు హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. కొన్ని సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ముందే తీర్పు ఇచ్చాయి. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే.. ఈ సర్వేలను నమ్మచ్చా?.. అని.. ఇంతకీ ఈ ఉపఎన్నికపై ఏ సర్వే సంస్థ ఏం అంచనా వేసిందో చూద్దాం.
విజయోత్సవ వేళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాన మంత్రి మోదీ సాయంత్రం 6 గంటలకు విచ్చేయనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్‌కి 38 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాను గెలిస్తేనే ముఖానికి ధరించిన మాస్క్ ను తొలగిస్తాను అని శపథం చేసిన ఓ మహిళ.. ఓటమి అంచుల్లో ఉంది.
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.