• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్

Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్

Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..

Loksabha polls: రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా?..  రాజాసింగ్ ఎద్దేవా

Loksabha polls: రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా?.. రాజాసింగ్ ఎద్దేవా

Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Loksabha polls: కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: నామా

Loksabha polls: కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: నామా

Telangana: ప్రచారంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్తి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... క్యాడర్ అందరు కలిసి కట్టుగా పనిచేశారని.. గ్రామస్థాయిలో బాగా ప్రచారం జరిగిందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాల గురించి తనకే చెప్పారన్నారు.

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

Bandi Sanjay: బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్

Bandi Sanjay: బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్

మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్‌లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.

Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!

Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!

పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు.

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.

Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత

Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే సమయం ఉండటంతో ప్రచారం నేటి సాయంత్రానికి ముగియనుంంది. అరవై రోజుల పాటు పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రతి ఏరియాలోనూ మైకుల మోత మోగింది.

Telangana: నేటితో ముగియనున్న ప్రచారం..

Telangana: నేటితో ముగియనున్న ప్రచారం..

నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.

Loksabha Polls: మహిళ ఓటర్లే కీలకం.. ఎందుకంటే..?

Loksabha Polls: మహిళ ఓటర్లే కీలకం.. ఎందుకంటే..?

లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి