పూజలు లేని ఆలయాలను దూపదీప నైవేద్యం పథకం కింద పరిరక్షిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. భగవన్ నామస్మరణ కోసం ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తున్నామని... 476 ఆలయాలకు పాలకవర్గం ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ CI నంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఏబీఎన్ కథనంపై స్పందించిన అధికారులు ప్రిన్సిపాల్ పెత్తనస్వామిని సస్పెండ్ చేశారు. పెత్తనస్వామిని సస్పెండ్ చేస్తూ.. డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెరా ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియని దారుణహత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ.
రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
CID వేసిన పిటీషన్‌పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.
సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.