ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసి పది రోజులైంది. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మరో 11 రోజులు ఓపికపట్టాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో స్పష్టత రానుంది. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.