ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసి ఉంది. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 250,247 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గుంటూరు రూరల్, కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు అనే మండలాలు ఉన్నాయి. 1952లో తమ్మ కోటమ్మ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, 1967లో స్వతంత్ర అభ్యర్థిగా నాగయ్య, 1972లో కాంగ్రెస్ నుంచి పీటర్ పాల్, 1978లో కాంగ్రెస్ నుంచి లక్ష్మీ నారాయణ రెడ్డి, 1983, 1985, 1989, 1994, 1999లో టీడీపీ నుంచి వరుసగా మాకినేని పెద రత్తయ్య ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ నుంచి రావి వెంకట రమణ, 2008లో కాంగ్రెస్ నుంచి మేకతోటి సుచరిత, 2012లో వైసీపీ నుంచి మేకతోటి సుచరిత, 2014లో టీడీపీ నుంచి రావెల కిషోర్ బాబు, 2019లో వైసీపీ నుంచి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్, టీడీపీ నుంచి బి.రామాంజనేయులు పోటీ పడనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో జనసేన, బీజేపీ ఇక్కడ పోటీ చేయట్లేదు.
36
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
