జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలవైపు మళ్లిన నేత. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన. ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అటు సినిమాలోనూ.. ఇటు రాజకీయాలలో రాణిస్తున్న ఆయన గురించి మరిన్ని వివరాలు.. బాల్యం ఏపీలోని బాపట్లలో 1971 సెప్టెంబర్ 2న వెంకటరావు, అంజనాదేవి దంపతులకు పవన్ జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యభ్యాసం బాపట్లలోనే జరిగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని వీఆర్ కాలేజీలో చేశారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసి సినిమాల వైపు మళ్లారు. సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగి లక్షల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు.
రాజకీయ జీవితం
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోయింది. దీంతో 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2014 మార్చి 14న పవన్.. అభిమానులు సమక్షంలో జనసేన పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ పొత్తుకు సపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో జనసేన 175 స్థానాలు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేయగా.. రెండు చోట్లా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద రావు గారు తప్ప ఇంకెవరూ గెలవలేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేనా, టీడీపీలు మరోసారి కలిసి బరిలో దిగుతున్నాయి. పవన్ ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేశారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 55 | 15 | Film Actor | 10th Pass | 164 Cr+ | 65 Cr+ | 46Cr+ | 118Cr+ | 12Cr+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
