శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం పరిధిలో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. జిల్లాలో ఎక్కువ మండలాలు ఉన్న నియోజకవర్గం ఇదే. అలాగే సమస్యలు అధికంగా ఉన్న నియోజకవర్గం. కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, లక్ష్మీనర్సుపేట (ఎల్.ఎన్.పేట) మండలాలు పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నాయి. 1951లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 1996 ఉపఎన్నికలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన లక్ష్మిపార్వతి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎక్కువగా గిరిజన గ్రామాలున్న ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాగావళి, వంశధారా నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నా, ఈ ప్రాంతపు రైతులకు ఒక చుక్క సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. వంశధారా రెండోదశ పనులు పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. వంవధార రెండోదశ పనుల కోసం భూములిఛ్చిన రైతులకు మంజూరైన పరిహారం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో అందలేదు. ఫలితంగా, జీవనోపాధిని పోగొట్టుకున్న రైతులు వలస వెళ్తున్నారు. గిరిజన గ్రామాలలో తాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి మామిడి గోవిందరావు పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
