తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1983లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా పని చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
విద్యావంతుడు..
లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివారు. నారా లోకేశ్ 2014లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2017లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ (ఎన్టీఆర్ ట్రస్ట్) ట్రస్టీలలో లోకేశ్ ఒకరు.
యువగళం పేరిట ప్రజల్లోకి..
2023 జనవరి 27 న కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మే 2018లో, దిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమ్మిట్‌లో బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ "డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్"ను గెలుచుకున్నారు. సెప్టెంబర్ 2018లో, చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, ప్రపంచ ఛాంపియన్ల వార్షిక సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు లోకేశ్ కు ఆహ్వానం అందింది. ఇలా నామినేట్ అయిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2007 లో లోకేష్ తన మామ బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు . ఈ దంపతులకు దేవాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 41 | 17 | Social Service (Politician) | Post Graduate | 542 Cr+ | 18Cr | 394 Cr+ | 394 Cr+ | 1 Cr+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
