సమైక్య ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1950 ఏప్రిల్ 20 న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1994 నుండి 2004 వరకు 13వ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తికాక ముందే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
మంత్రిగా..
టంగుటూరి అంజయ్య హయాంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే మంత్రి అయిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. సెప్టెంబర్ 10 న ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మూడో కుమార్తె నందమూరి భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందడంతో అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కుప్పం నుంచి ఎన్నికై ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రిగా..
1995 సెప్టెంబరు 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2004 వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు. భవిష్యత్ అవసరాలు, సమస్యలను ముందే గుర్తించి "విజన్ 2020" పేరుతో ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించారు. అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశారు. 1998లో హైదరాబాద్ లో హైటెక్ సిటీని ప్రారంభించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 294 సీట్లకు గాను 185 సీట్లు గెలుపొందింది.
చంద్రబాబుపై హత్యాయత్నం..
2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. 1992లో హెరిటేజ్ గ్రూపును స్థాపించారు. 2019 ఎన్నికలలో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 74 | 19 | Social Service (Politician) | Post Graduate | 931 Cr+ | 10 Cr+ | 810 Cr+ | 121Cr+ | 18 Lacs |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
