గుంటూరు జిల్లా కేంద్రంలోని పశ్చిమ ప్రాంతానికి చెందినదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి.2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన మద్దాలి గిరిధరరావు తరువాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,65,135 మంది ఓటర్లు ఉన్నారు. 2008లో నియోజకవర్గం స్థాపించబడింది. ఇందులో గుంటూరు మండలం ఒకటే ఉంది. 1955లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు, 1962, 1967లో కాంగ్రెస్ నుంచి చేబ్రోలు హనుమయ్య, 1972లో స్వతంత్ర అభ్యర్థి వెంకటరత్నం, 1978లో కాంగ్రెస్ నుంచి గాదె వీరాంజనేయ శర్మ, 1983లో టీడీపీ నుంచి వెంకటరత్నం, 1985, 1989లో కాంగ్రెస్ నుంచి చదలవాడ జయరాంబాబు, 1994లో టీడీపీ నుంచి చల్లా వెంకట కృష్ణా రెడ్డి, 1999లో శనక్కాయల అరుణ టీడీపీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి తాడిశెట్టి వెంకటరావు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009లో కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్దాలి గిరిధర రావు తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2024లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా భువనేష్ రెడ్డి, టీడీపీ నుంచి తిరుమల శెట్టి మనోహర్, స్వతంత్ర అభ్యర్థిగా పాటిబండ్ల విజయ్ పోటీలో ఉన్నారు.
94
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
